Bank Of India Specialist Security Officers Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు

Bank Of India Specialist Security Officers Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 2025 సంవత్సరానికి సంబంధించి స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా, అర్హులైన అభ్యర్థులు సెక్యూరిటీ ఆఫీసర్ గా జాబ్ పొందవచ్చు.

Bank Of India Specialist Security Officers Recruitment 2025

ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిడిల్ మేనేజ్‌మెంట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది (గ్రేడ్/స్కేల్-II).

ఖాళీల వివరాలు:
సెక్యూరిటీ ఆఫీసర్:
10 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యర్హత ఉండాలి.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.64820- రూ.93,960.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు:

SC/ST రూ. 175/- (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే)
జనరల్ & ఇతరులు రూ. 850/- (దరఖాస్తు రుసుము + ఇంటిమేషన్ ఛార్జీలు)

దరఖాస్తు విధానం: అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (https://www.bankofindia.co.in) లో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ 18.02.2025 నుండి ప్రారంభమవుతుంది
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 04.03.2025
వయస్సు/అర్హత/అనుభవానికి సంబంధించిన తేదీ 01.01.2025

నోటిఫికేషన్‌:

Bank Of India Specialist Security Officers Recruitment Notification 2025 PDF

అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు:

Bank Of India వెబ్‌సైట్ https://bankofindia.co.in/

Online Applicationhttps://ibpsonline.ibps.in/boissofeb25/